‘మా డబ్బుతో మేం తాగుతాం! మీకేంటి?’: పోలీసులకు షాకిచ్చిన తల్లీకొడుకు
హైదరాబాద్: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడమంటే పోలీసులకు ఓ సవాలుగానే మారుతోంది. మద్యం మత్తులో వచ్చే వాహనదారులు పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించకుండా ముప్పు తిప్పలు పెడుతుంటారు. తాజాగా, పోలీసులకు ఓ వింత అనుభవం ఎదురైంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 11న రాత్రి రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఎస్సై ఇబ్రహీం సిబ్బందితో కలిసి ఆరాంఘర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వాహనదారుడికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

అదే సమయంలో శంషాబాద్ మండలం రషీద్ గూడకు చెందిన చెన్నమ్మ, ఆమె కొడుకు శ్రీశైలం కాలినడకన వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న చెన్నమ్మ, శ్రీశైలంలు అక్కడే ఉన్న పోలీసులను బూతులు తిట్టారు. అంతేగాక, 'మా డబ్బుతో మేం తాగితే మీకేంటి?' అంటూ వాగ్వాదానికి దిగారు.
ఎస్సై ఇబ్రహీం ఎంత వారించినా వినకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. చెన్నమ్మ, శ్రీశైలంలపై కేసు నమోదు చేసి అక్కడ్నుంచి పంపించేశారు. సోమవారం వారిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు ఎస్ఐ నారాయణ రెడ్డి తెలిపారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications