రాత్రివేళ ఒంటరి మహిళలకు పోలీసుల ఉచిత వాహన పథకం.. నిజమెంతంటే!
తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం పోలీసులు రాత్రివేళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారని, తెలంగాణలో ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు ఉచిత వాహన పథకం ప్రారంభించారని, రాత్రి వేళల్లో ఒంటరి మహిళలు వాహనాలు దొరక్కపోతే పోలీసుల ఉచిత వాహన పథకాన్ని వినియోగించుకోవచ్చని, దానికోసం టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఒక పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పోలీస్ వాహన ఉచిత పథకం
రాత్రి 10:00 నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరి మహిళలు వాహనాలు దొరికని పక్షంలో ఇంటికి వెళ్లేందుకు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లను 1091 మరియు 7837018555 నంబర్లను సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పోలీసులు ఉచిత వాహన పథకం ప్రారంభించిన క్రమంలో వారు 24గంటలు పని చేస్తారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఉచితంగా మహిళలను ఇళ్ళకు చేరుస్తారని పోస్టు
కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పిసిఆర్ వాహనం లేదా ఎస్ హెచ్ ఓ వాహనం సదరు మహిళను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకు వెళుతుందని ఇది ఉచితంగా చేయబడుతుంది అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని పంపించండి అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ వార్త
మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు ఇలా మహిళలు అందరికీ ఈ పోస్టును పంపించమని హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పైన హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఇది మహిళలను తప్పుదారి పట్టించే న్యూస్ అని కావాలని కొందరు దీనిని మిస్ లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
— Hyderabad City Police (@hydcitypolice) August 22, 2024
పోలీసుల క్లారిటీ ఇదే
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు ఇటువంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడం నేరమని హెచ్చరిస్తున్నారు. ఈ వార్తలలో విశ్వసనీయత లేదని, దీనికి పోలీసు శాఖకు ఎటువంటి సంబంధం లేదని దయచేసి ఇటువంటి వార్తలను వ్యాప్తి చేసి గందరగోళం క్రియేట్ చేయొద్దని సూచించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications