గోనెసంచిలో మహిళ మృతదేహం: బైక్‌పై మృతదేహం తరలింపు, నిందితుల ఫోటోల విడుదల

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 10 రోజుల క్రితం మాదాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద గోనెసంచిలో మహిళ శరీరబాగాలను పారేసిన ఘటనపై పోలీసుల పురోగతిని సాధించారు. నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను పోలీసులు గుర్తించారు. మృతురాలు ఉత్తరాది రాష్ట్రంలోని అసోం రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు.

  గర్బిణి హత్య వెనుక వివాహేతర సంబందం?

  10 రోజుల క్రితం మాదాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద మహిళ శరీర బాగాలను గోనెసంచిలో కట్టి పారేశారు. శవాన్ని ముక్కలు ముక్కలుగా వేరు చేసి గోనెసంచిలో కుక్కారు.

  హత్యకు గురైన మహిళ గర్భవతిగా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలింది. మహిళ ధరించిన గాజులు, దుస్తులను బట్టి ఉత్తరాది రాష్ట్రాలకు చెందినదిగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  నిందితులు వాడిన బైక్‌ను గుర్తించిన పోలీసులు

  నిందితులు వాడిన బైక్‌ను గుర్తించిన పోలీసులు

  10 రోజల క్రితం మాదాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో గోనెసంచిలో మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కోసి పారేశారు. ఈ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు.ఈ హత్య కేసులో కీలక నిందితులను సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని ఏపీ 10 ఏఎల్‌ 9947 నంబర్‌ ఉన్న యమహా బైక్‌పై తీసుకువచ్చి బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

  నిందితుల పోటోను విడుదల చేసిన పోలీసులు

  నిందితుల పోటోను విడుదల చేసిన పోలీసులు

  నిందితులు ఉపయోగించిన మోటార్ బైక్ బౌద్దనగర్‌లోని ఆనంద్‌ కుటీర్‌కు చెందిన గర్డే విజయ్‌కుమార్‌కు చెందిందిగా పోలీసులు గుర్తించారు. నిందితులు గోనెసంచిని యమహ మోటార్ బైక్‌పై ఉంచుకొని బొటానికల్ గార్డెన్ వద్దకు తీసుకెళ్ళి పారేశారు. నిందితుల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.

  అనుమానితుల విచారణ

  అనుమానితుల విచారణ


  ఈ కేసుకు సంబందించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు అసోం లేదా మహరాష్ట్ర వాసిగా భావిస్తున్నారు. మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారిని పోలీసులు విచారిస్తున్నారు. అసోం, మహరాష్ట్రాలకు చెందినవారిని పోలీసులు విచారించారు.

  ఎందుకు చంపారు

  ఎందుకు చంపారు

  అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేయడం సంచలనం కల్గిస్తోంది. అయితే ఈ కేసులో నిందితులు ఉపయోగించిన మోటార్ బైక్‌ను పోలీసులు గుర్తించారు. నిందితుల చిత్రాలను కూడ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. అయితే నిందితులు పట్టుబడితే అసలు ఈ హత్యలకు గల కారణాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కానీ, ఆ మహిళను నిందితులు ఎందుకు అత్యంత కిరాతకంగా హత్య చేశారనే విషయమై నిందితులు పట్టుబడితే కానీ, స్పష్టత వచ్చే అవకాశం లేదంటున్నారు పోలీసులు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hyderabad police released suspected persons photos in Kondapur pregnant woman murder case on Sunday. 10 days back police found lady dead body in a bag near madhapur.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి