పోలీసుల చేతుల్లోకి 'అన్నపూర్ణ స్టూడియో'
హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోకు నాలుగు వైపుల కంచెను ఏర్పాటు చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్‌కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం జరుగనుంది. ఈక్రమంలోనే ముందస్తు జాగ్రత్తగా జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల నలువైపులా బారికేడ్లను జూబ్లీహిల్స్ పోలీసులు ఏర్పాటు చేశారు.
అన్నపూర్ణ స్టూడియోకు కంచె వేసిన పోలీసులు..!#AnnapurnaStudios #BiggBoss8 #BiggBoss8Telugu #BiggBossTelugu8 #BiggBossTelugu #BiggBossTelugu #Telanagana pic.twitter.com/0bzvbkoC5R
— oneindiatelugu (@oneindiatelugu) December 15, 2024
ఇందిరా నగర్, కృష్ణా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.బిగ్ బాస్ 8వ సీజన్ ముగింపు కావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతోనే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల అల్లు అర్జున్ విషయంలో పెద్ద వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications