మద్యం మత్తులో నగ్నంగా రోడ్లపై చిందులు: పోలీసుల వేట

హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి కొందరు ఆకతాయిలు నగ్నంగా చిందిలేసి రెచ్చిపోయారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడికి తెగబగబడ్డారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటన ఎల్బీనగర్‌ బ్యాంక్ కాలనీలో చోటు చేసుకుంది.

మద్యం సేవించి కొందరు యువకులు ఒంటి మీద నూలుపోగు లేకుండా నడిరోడ్డుపై చిందులేశారు. ఇరుగుపొరుగు వారు ఇదేంటని ప్రశ్నించినా.. వారు పట్టించుకోలేదు. వారి పిచ్చిచేష్టలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేష్ అనే యువకుడిపై ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు.

Police hunts for nude danced youth

దాడిలో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన యువకులు జిలానీ, గిరిగా పోలీసులు గుర్తించారు. మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

278మంది డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దు

గత నెలలో రహదారులపై నిబంధనలు ఉల్లంఘించి, మద్యంమత్తులో వాహనాలు నడిపిన 278మంది వాహనచోదకుల డ్రైవింగ్‌ లైసెన్సులను రవాణాశాఖ అధికారులు రద్దు చేశారని అదనపు సీపీ(ట్రాఫిక్‌) జితేందర్‌ వెల్లడించారు. వీరిలో 217మంది మంది మోతాదుకు మించి మద్యంతాగి పట్టుబడ్డారని, మిగిలిన వారు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+