బోల్తా పడిన టమాటా లారీ: పరుగెత్తుకొచ్చిన జనం, పోలీసుల కాపలాతో వెనక్కి
హైదరాబాద్: టమాటాల ధరలు సామాన్య ప్రజలను అల్లాడిస్తున్నాయి. సాధారణంగా రూ. 10 నుంచి 20 రూపాయలకు కిలో ఉండే.. టమాట ధర ఏకంగా ఇప్పుడు 200 రూపాయలు దాటడం గమనార్హం. దీంతో సామాన్య ప్రజలు టమాట వాడకాన్ని తగ్గించేశారు. టమాట ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు, కొందరు దొంగలు టమాటలను కూడా వదలకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది టమాటాలతో వెళుతున్న లారీ. దీంతో జనం అక్కడికి భారీగా చేరుకున్నారు. కొందరు కొన్ని టమాటలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఆ లారీకి కాపలాగా వచ్చారు. దీంతో చేతికందిన టమాటాలు తీసుకెళ్దామనుకున్న జనం నిరాశతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

కాగా, కర్ణాటక నుంచి ఢిల్లీకి తరలిస్తున్న టమాటాల లారీ.. ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన జరిగింది. లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌కు, ఇతరులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ లారీలో దాదాపు రూ. 28 లక్షలు విలువ చేసే టమాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. లారీ యజమాని అభ్యర్థన మేరకు స్థానికులెవరూ వాటిని ఎత్తుకెళ్లకుండా పోలీసులు కాపలాగా ఉన్నారు. టమాటా ధరలు భారీగా పెరిగన నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించినట్లు యజమాని చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగాయి. కిలో ధర రూ. 200 నుంచి 300 వరకు పలుకుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీపై టమాటాలను అందిస్తున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా ధరలు ఉండటంతో కర్ణాటకలో కొంత తక్కువగా ఉన్నాయి. దీంతో కర్ణాటక నుంచి ఢిల్లీకి టమాటాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications