ప్రియుడు మోసం చెయ్యటంతోనే ప్రవళిక ఆత్మహత్య; పోలీసుల సంచలన ప్రకటన!!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రవళిక గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడిన కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగితే, పోలీసులు ప్రవళిక ఆత్మహత్యపై సంచలన విషయాలు వెల్లడించారు. బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్టు చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి వెల్లడించారు.
ప్రభుత్వానికి, గ్రూప్2 పరీక్షలు వాయిదాకు, ప్రవళిక ఆత్మహత్యకు ఏ విధమైన సంబంధం లేదని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల కోసం ప్రవళిక చనిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని చేసిన దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెల్లడి అయినట్టు పేర్కొన్నారు. ఆమె శవ పంచనామా చేసి పోస్టుమార్టం అనంతరం ప్రవళిక మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారని పేర్కొన్నారు.

అశోక్ నగర్ బృందావన్ గర్ల్స్ హాస్టల్ లో శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక ఉంటున్న గదిని, ఆమె ఉపయోగించిన ఫోన్ వాట్సాప్ లను పరిశీలించామని, ఆమె స్నేహితులను విచారించిన అనంతరం ప్రవళిక ప్రియుడు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. ప్రవళిక ప్రియుడు తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దిగులు చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఏసిపి తెలిపారు.
ప్రవళిక మరణాన్ని రాజకీయం చేయొద్దని చిక్కడపల్లి ఏసిపి పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఈ ఆత్మహత్యను వాడుకోవద్దని సూచించారు. కొందరు ప్రవళిక ఆత్మహత్యను అదునుగా చేసుకొని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేయడం, రాళ్లు రువ్వడం చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని, ఇక వారందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిక్కడపల్లి ఏసిపి యాదగిరి తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రవళిక ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల సమరం జరుగుతుంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, శవాల మీద రాజకీయాలు చెయ్యొద్దు అంటూ అధికార పార్టీ ఘాటుగా ప్రత్యర్థి పార్టీలకు ఘాటుగా బదులిస్తుంది. ఇదే సమయంలో తాజాగా ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు చెప్పిన అంశాలు సంచలనంగా మారాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications