Loksabha Election 2024: ఆ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్.. ఎందుకంటే..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.తెలంగాణలోని ఐదు ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసింది.

ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ, లోక్ సభ కలిపి 55.49శాతం పోలింగ్‌ నమోదు అయింది. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మంలో 63.67 శాతం, కరీంనగర్‌ 58.24, మహబూబాబాద్‌ 61.4, పెద్దపల్లి 55.92, నల్గొండ 59.91 శాతం చొప్పున నమోదు అయింది.

Polling ended at 4 pm in troubled areas

తిరుపతిలోని 13వ వార్డులో 141, 142, 143 బూత్‌ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. తాడికొండ నియోజకవర్గం నిడుముక్కలలో 83వ బూత్ వద్ద తెదేపా- వైకాపా వర్గాల ఘర్షణ జరిగింది. వనపర్తి జిల్లా అమరచింత జడ్పీ హైస్కూల్‌లో 2గంటలుగా ఈవీఎం పనిచేయడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+