Loksabha Election 2024: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ సెంటర్లకు తరలొస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ, ఒక అసెంబ్లీలో ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగునుంది. అయితే 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది.

ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం మెయిన్ పోలింగ్ ప్రారంభమైంది. ఎండల దృష్యా పోలింగ్ కేంద్రాల్లో తాగు నీటి వసతి కూడా కల్పించారు. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల కోసం తెలంగాణ వ్యాప్తంగా 5,809 పోలింగ్
స్టేషన్లు ఏర్పాటు చేసింది.

Polling for Lok Sabha elections has started in Telangana

90 శాతం కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకంగా గుర్తించారు. మరో వైపు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ ఎన్నికల్లో 2 లక్షల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో మైక్రో అబ్జర్వర్లు 12,909 మంది, సెక్టార్, రూట్ అధికారులు, 3,522 మంది, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ 1,200 మంది, మానిటరింగ్ అధికారులు 200 మంది ఉన్నారు. ఎన్నికల బందోబస్తులో 72 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు. తెలంగాణలో 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో స్త్రీలు 1,67,01,192 ఉండగా.. పురుషులు 1,65,28,366 మంది ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+