హరీష్ కు పొంగులేటి కౌంటర్- బీఆర్ఎస్ లో మీ ఫ్యూచరేంటో తెలీదు..!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్మిస్తున్న ప్యూచర్ సిటీ చర్చనీయాంశమవుతోంది. ఫ్యూచర్ సిటీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్ష బీఆర్ఎస్ నేత హరీష్ రావు.. తాము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేసి ఫార్మా సిటీని పునరుద్దరిస్తామని హెచ్చరికలు చేశారు. దీంతో హరీష్ రావు (Harish Rao) కు ఫ్యూచర్ సిటీ ఆపడం తర్వాత, ముందు బీఆర్ఎస్ లో మీ ఫ్యూచర్ చూసుకోండని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) కౌంటర్ ఇచ్చారు.
హరీష్ రావు గారు.. బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా ? అంటూ పొంగులేటి ఇవాళ ఓ ఘాటు ట్వీట్ పెట్టారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు .. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అక్కడ ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా..? అని ప్రశ్నించారు. పదేళ్లలో హైదరాబాద్ లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నది అంటే అసూయ కలగక తప్పదని పొంగులేటి వ్యాఖ్యానించారు.

హరీష్ రావు గారు @BRSHarish ..బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా ?
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) May 23, 2026
అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు గారు.. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా..?
పదేండ్లలో హైదరాబాద్…
కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారని, కానీ తాము రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే, ఆపుతాం అంటున్నారని ఆక్షేపించారు.మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారని, లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేసారని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారని గుర్తుచేసారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న హరీష్ రావు, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందని జోస్యం చెప్పారు. మీ పొలిటికల్ ఫ్యూచర్ ఖతం చెయ్యాలి అని మీ మామా మీ బామ్మర్ది చూస్తున్నారని, ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకోవాలని సూచించారు. చివరగా బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదని ముగించారు.














Click it and Unblock the Notifications