25న ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి- కాంగ్రెస్‌లో షర్మిల చేరికపైనా క్లారిటీ
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నాగర్‌కర్నూలు, మంచిర్యాల, జోగుళాంబ గద్వాల.. జిల్లాల్లో ఇటీవలే పర్యటించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులను ప్రారంభించారు. ప్రగతి నివేదన పేరుతో నిర్వహించిన బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలపై వరాల జల్లును కురిపించారు.

అదే సమయంలో కాంగ్రెస్ జూలు విదిలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇందులో భాగంగా- ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు గానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు.
జూపల్లి కృష్ణారావు పరిస్థితీ అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడిక మళ్లీ సొంతగూటికి చేరబోతోన్నారు జూపల్లి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు. దీనికోసం వారిద్దరూ బుధవారం వేర్వేరుగా తమ అనుచరులతో భేటీ కానున్నారు.
కాంగ్రెస్‌లో చేరబోతోన్న విషయాన్ని వారిద్దరూ ఈ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం వారిని స్వయంగా కలుస్తారని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన దేశ రాజధానిలో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో షర్మిల సైతం త్వరలోనే కాంగ్రెస్‌లో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications