ponguleti srinivas reddy: కొత్తపార్టీ దిశగా పొంగులేటి అడుగులు? తెలంగాణా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ !!

తెలంగాణ రాజకీయాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన పొంగులేటి వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. జాతీయ పార్టీలు పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేస్తుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... తెలంగాణ సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకుడు. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీపై నిరసన గళం వినిపించిన నేత. తనపై పార్టీ వేటు వేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చూస్తానంటూ శపధం చేసిన విషయం తెలిసిందే.

Ponguleti srinivas reddy steps towards a new party? this is what happening exactly

ఇక దీంతో బిజెపి, కాంగ్రెస్ లు తమ పార్టీలో చేరాలని వరుసగా పొంగులేటి తో చర్చలు జరిపాయి. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరతాను అనేది ప్రకటించని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తానే పార్టీని ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రైతు సమాఖ్య టిఆర్ఎస్ పేరుతో ఎన్నికల కమిషన్ వద్ద ఒక పార్టీ రిజిస్టర్ అయింది.

ఆ పార్టీని పొంగులేటి అనుచరులే రిజిస్టర్ చేయించారని ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో ఈ పార్టీ నుండి వివిధ జిల్లాలలో సుమారు 45 నియోజకవర్గాలలో తన అనుచరులను ఎన్నికల బరిలోకి దించాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న పొంగులేటి వివిధ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బలమైన నేతలను నియోజకవర్గాల వారీగా గుర్తించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం.తమకు మద్దతు తెలిపే నాయకులతో నేటి నుండి వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం.

జిల్లాల వారీగా కసరత్తు ముగిసిన తరువాత ఈనెల 15వ తేదీన పొంగులేటి తన అనుచరులతో సమావేశం కానున్నారని , తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక ప్రకటన ఆ తర్వాత చేయనున్నారని సమాచారం అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+