మనసులో మాట బయట పెట్టిన పొంగులేటి...!!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన మనసులో మాట బయట పెట్టారు. బీఆర్ఎస్ కు సవాల్ చేసారు.

మాజీ ఎంపీ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా పొంగులేటి పార్టీ మారుతున్నారనే చర్చ సాగుతోంది. ఏ పార్టీలోకి వెళ్తున్నారనేది క్లారిటీ లేదు. పొంగులేటి కొంత కీలంగా ఈ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఇంకా పార్టీ మార్పు పైన ఆలస్యం చేయటం సరి కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడటం పై క్లారిటీ ఇస్తున్నారు. పొంగులేటి ఏ నిర్ణయం తీసుకున్నా..తామంతా మద్దతుగా నిలుస్తామని అనుచర వర్గం చెబుతోంది. దీంతో..ఇప్పుడు ఇక బీఆర్ఎస్ కు సవాల్ చేసారు. తన మనసులో మాట బయట పెట్టారు. పార్టీ మార్పు పైన చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఇంకా పొంగులేటి దూరం కాలేదు. పార్టీకి రాజీనామా చేయలేదు. పార్టీ ఆయన పైన చర్యలు తీసుకోలేదు. కానీ, తాజాగా పొంగులేటి వర్గానికి చెందిన ఎనిమిది మంది పైన బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ వేటు వేసింది. వారికి ఉన్న నామినేటెడ్ పదువల నుంచి తొలిగించింది. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కార‌ణంగా వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీని పైన పొంగులేటి స్పందించారు. వారిని సస్పెండ్ చేయటం కాదని బీఆర్ఎస్ కు దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ చేసారు. గతంలో పార్టీ గెలుపు కోసం తనను ప్రాధేయపడ్డారని చెప్పుకొచ్చారు. తనకు బీఆర్ఎస్ లో సభ్యత్వం లేదని కొందరు మాట్లాడుతున్నారని..పార్టీలో సభ్యత్వం లేకపోతే డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫొటో ఎందుకు వినియోగించారని ప్రశ్నించారు.

Ponguleti Srinivasa Reddy Challenged BRS Leader Ship, gave clartiy on party change

బీఆర్ఎస్ లో కొనసాగేది లేదని పొంగులేటి తేల్చి చెప్పారు. అబిమానుల కోరిక మేరకే పార్టీ నిర్ణయం జరుగుతుందని స్పష్టం చేసారు. తొలుత పొంగులేటి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. అయితే, జిల్లాలో బీజేపీకి ఆదరణ లేదనే కారణంగా నిర్ణయం మార్చుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ నేతలతో విభేదాలు ఉండటంతో..ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక..తాజాగా వైఎస్ షర్మిల.. విజయమ్మతో పొంగులేటి సమావేశం అయ్యారు. దీంతో పొంగులేటి వైఎస్సార్టీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. షర్మిల పాదయాత్ర ముగింపు సభలో పొంగులేటి చేరిక ఉంటుందని చెబుతున్నారు. గతంలో వైసీపీ నుంచి ఎంపీగా పని చేసిన పొంగులేటి ఇప్పుడు వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఇక..ఇప్పుడు తన వాయిస్ పెంచిన పొంగులేటి పార్టీ మార్పు పైన త్వరలోనే ప్రకటన చేస్తారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+