తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా పంపిణీ, గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించింది. ఈ మేరకు త్వరలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఆ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తయిన సందర్భంగా జూన్ 24న సెక్రటేరియట్ ముందు రైతు సంబరాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ పై చట్టపరంగా, న్యాయ పరంగా ముందుకెళ్తామని తెలిపారు. చౌటుప్పల్- సంగారెడ్డి వరకు 201 కి.మీ. మేర ఆర్ఆర్ఆర్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. తెలంగాణ నీటి వాటాను రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9 లోపు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

అలాగే ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరణపై చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్త మున్సిపాలిటీలుగా సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాక క్రీడా పాలసీని క్యాబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా రాష్ట్ర ప్రభుత్వం వదులుకోదని ఈ విషయంలో కృతనిశ్చయంతో క్యాబినెట్ పని చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
-
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి! -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications