అబద్ధాల ప్లీనరీ, మోసాలపై ‘కేసీఆర్ అనే నేను’ సినిమా తీస్తాం: పొన్నం సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుది నోరా.. మొరా అంటూ దుయ్యబట్టారు.

అధోగతి ప్రాంగణం
టీఆర్ఎస్ ప్లీనరీ జరగుతున్నది ప్రగతి ప్రాంగణం కాదని.. తెలంగాణను అధోగతి చేసే ప్రాంగణం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని సాక్షాత్తు మండలిలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు.

అబద్ధాలు, భజనల వేదిక
ప్లీనరీలో కనీసం సోనియాను తలుచుకోకపోవడం దారణమని, తెలంగాణ ఇచ్చిన వారిని గౌరవించుకునే సంస్కారం కేసీఆర్‌కు లేదంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ అబద్ధాలకు, భజనలకు వేదిక అంటూ పొన్నం ఎద్దేవా చేశారు.

మచ్చర్ పహిల్మాన్
దేశంలో అబద్దాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని పొన్నం అన్నారు. ప్లీనరీ కోసం పదవ తరగతి ఫలితాలను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ మచ్చర్ పహిల్మాన్ అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అనే నేను
కేసీఆర్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని పొన్నం అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ అబద్దాలు, మోసాల మీద 'కేసీఆర్ అనే నేను' సినిమా తీస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications