Dharani: ధరణిలో కీలక మార్పులు.. ఇక వారికి కూడా అధికారాలు..!

తెలంగాణలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ధరణి వెబ్ సైట్ లో కలెక్టర్లకు ఉన్న అధికారాలను కింది స్థాయి అధికారులకు బదిలీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ), ఆర్డీఓలు, ఎమ్మార్వోలకు కొన్ని అధికారాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలెక్టర్ల పై పని ఒత్తిడి తగ్గడంతో పాటు.. త్వరగా పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.

కాగా సచివాలయంలో బుధవారం ధరణఇ కమిటీ సమావేశం అయింది. ఈ భేటీలో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ధరణి సాఫ్ట్‌‌వేర్‌‌ సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ధరణి చేయాల్సిన మార్పులపై దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ధరణిలో ఎదైనా మార్పు చేయాలంటే కలెక్టర్లకే అధికారం ఉంది. ఇది పెద్ద సమస్యగా ఉన్నట్లు కలెక్టర్లు చెప్పారు.

Possibility of transferring the powers of Collectors in Dharani to RDO and MRO

తమకున్న వర్క్ తో పాటు ఇది కూడా చేయాలంటే సమయం పడుతుందన్నారు. దీంతో సమస్యలు త్వరగా పరిష్కమయ్యే అవకాశం లేదన్నారు.
అధికారాల్లో కొన్నింటిని అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ), ఆర్డీఓలు, ఎమ్మార్వోలకు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా క‌‌లెక్టర్‌‌కు ఒక్క ధరణి పనులే కాకుండా జిల్లా ప‌‌రిపాల‌‌న‌‌కు సంబంధించి అనేక ప‌‌నులు ఉంటాయి. దీంతో ధరణి దరఖాస్తులపై వాళ్లు దృష్టిపెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మార్వో, ఆర్డీఓ, అడిషనల్​కలెక్టర్లకు కొన్ని మాడ్యుల్స్​కు ధరణిలో అధికారం ఇస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో భూ భారతిపై కూడా చర్చించారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుపైనా ధరణి కమిటీ చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు సగంలోనే ఆగిపోగా.. అప్పటికే వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+