Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ స్థానాలలో పోస్టింగ్.. ఎవరు ఎక్కడంటే!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 12 మంది ఐపీఎస్ అధికారులు, మరికొంత మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ వారి పోస్టింగ్‌లకు నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం .

ఈ సాయంత్రం 4 గంటలలోపు ఈ అధికారులు తమ కొత్త పోస్టింగ్‌లో చేరాలని డిజిపిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాలలో నలుగురు కొత్త కలెక్టర్లు, ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులు కొత్త పోస్టింగ్‌లలో చేరాలని పేర్కొన్నారు.

Posting for IAS and IPS positions transferred by EC.. this is the latest transfers list!!

దీని ప్రకారం, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సునీల్ శర్మను బదిలీ చేసి, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్‌ల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ చేశారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు వాణిజ్య పన్నుల కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

అలాగే హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా సందీప్ శాండిల్య, వరంగల్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనర్ గా కమలేశ్వర్ ను ఎంపిక చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గా రూపేష్, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, కామారెడ్డి ఎస్పీ గారు సింధు శర్మ, సూర్యపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే లకు స్థానం కల్పించారు.

నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్, జగిత్యాల ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్, మహబూబాబాద్ ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, భూపాలపల్లి ఎస్పీగా కారే కిరణ్ ప్రభాకర్ , జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ గా రితి రాజ్, మహబూబ్నగర్ ఎస్పీగా హర్షవర్ధన్ లకు స్థానం కల్పించారు. రాష్ట్రం పంపిన ప్యానెల్ నుంచి ఈ అధికారులను ఈసీ ఎంపిక చేసి ఈ సాయంత్రం లోపు తమ తమ పోస్టింగ్ లో చేరాలని ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+