మోజు తీర్చుకున్నాడు .. సజీవ దహనం చెయ్యబోయాడు .. వివాహేతర బంధమే కారణం

వివాహేతర సంబంధం ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. మోజు తీర్చుకున్న ప్రియుడు ఆ మహిళను వదిలించుకోవడానికి ఆమెపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగింది.

వివాహేతర సంబంధం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది

వివాహేతర సంబంధం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఓ వ్యక్తి మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత జంగం మంగమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం పాటు నడిచిన వీరి వ్యవహారం ఇటీవల కాలంలో బెడిసికొట్టింది. ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవలు ప్రారంభం కావడంతో మంగమ్మ ని ఎలాగైనా అడ్డు తప్పించాలని భావించాడు రాములు.

కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు .. ఇరువురి మధ్య గొడవలే కారణం

కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు .. ఇరువురి మధ్య గొడవలే కారణం

తనను ఇబ్బంది పెడుతుందన్న కక్షతో ఆమెను హత మార్చడానికి ప్లాన్ చేసాడు.మంగళవారం సాయంత్రం కూలీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మంగమ్మపై దాడి చేశాడు . రాములు ముందుగానే తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ కు గురైన మంగమ్మ హఠాత్తుగా జరిగిన పరిణామంతో మంటల్లో కాలిపోతూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ప్రాణాలకై పోరాడుతున్న మహిళ.. నిందితుడు మొదటి నుండీ నేరస్తుడే

ప్రాణాలకై పోరాడుతున్న మహిళ.. నిందితుడు మొదటి నుండీ నేరస్తుడే

ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, చావుబతుకుల మధ్య ఉన్న మంగమ్మ ను మరింత మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మంగమ్మను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన రాములు పలు హత్య కేసుల్లో నిందితుడు. రాములు సొంత కుటుంబసభ్యులనే హతమార్చాడని, గతంలో అతనిపై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంగమ్మ ను సజీవదహనం చేయడానికి యత్నించిన రాములు పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సదరు మహిళ ప్రస్తుతం ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+