video: ప్రజాభవన్ కాదు ఇంద్రభవన్.. ఈ వీడియో చూస్తే మీరే షాకవుతారు!!

రాజధాని నడిబొడ్డున ఉన్న వాస్తు అనుకూల పవర్ హౌస్ ప్రజా భవన్ యొక్క రాజకీయ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరియు కార్యాలయంగా ఏర్పాటైన ప్రగతి భవన్ ప్రస్తుత ప్రజా భవన్ చాలా ప్రత్యేకంగా నిర్మించబడిందని తాజాగా వైరల్ అవుతున్న వీడియోతో అర్ధం అవుతుంది.

ప్రజా భవన్ లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకు ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. తాజాగా ఈ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో బిల్డింగ్ లోపల ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూసిన వారంతా ఇది ప్రజా భవన్ కాదు ఇంద్ర భవన్ అంటూ ఆ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు.

Praja Bhavan is looks like Indra Bhavan.. prajabhavan inside video viral!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాజ దర్పం తొణికిసలాడేలా కాస్ట్ లీ ఫర్నిచర్ తో సుందరమైన గదులు కనిపిస్తున్నాయి. విశాలమైన హాల్, అతిపెద్ద డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరిమిట్లు గొలిపే లైటింగ్ తో ప్రజా భవన్ ఇంద్ర భవనాన్ని తలపిస్తోందని ఈ వీడియోలను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.

కెసిఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారని, ఇదంతా ప్రజల సొమ్మే గా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కెసిఆర్ ఈ భవనం తన అధికారిక నివాసం చేసుకున్న తరువాత ఆయనకు సంబంధించిన ముఖ్యులకు తప్ప, ఎవరికి ప్రగతి భవన్లోకి అనుమతి లేదు.

సామాన్య ప్రజలు ప్రగతి భవన్ లోకి వచ్చే అవకాశమే లేదు. చుట్టూ బారికేడ్లు, కంచెలతో లోపలి ఎవరూ వెళ్ళే వీలు లేకుండా ఉండేది. ఎమ్మెల్యేలు అయినా సరే కేసీఆర్ అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదు. ఇక కాంగ్రెస్ హయాంలో ఈ భవనానికి ఉన్న కంచెలను , బారికేడ్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా భవన్ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించింది. ఇక తాజాగా ప్రజా భవన్ వీడియో వైరల్ కావటంతో మరోమారు ప్రజా భవన్ పై చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+