కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో కీలకంగా ప్రకాశ్ రాజ్ పాత్ర: తెలంగాణ నుంచి పోటీ? దక్షిణాది కో-ఆర్డినేటర్!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ థర్డ్‌ఫ్రంట్(ఫెడరల్ ఫ్రంట్) కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లతో కేసీఆర్ భేటీ అయి థర్డ్‌ఫ్రంట్ పై చర్చించారు.

  మాజీ ప్రధాని దేవేగౌడతో కెసిఆర్ భేటీ...!

  తాజాగా, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై కీలకంగా చర్చించారు. కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌కు తన మద్దతు ఉంటుందని దేవెగౌడ్ ప్రకటించారు. కాగా, ఈ భేటీలో ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొనడం గమనార్హం. దేవెగౌడతో భేటీకి ఆయన కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

  బెంగళూరుకు కేసీఆర్, వెంటే ప్రకాశ్‌రాజ్: దేవెగౌడతో కీలక అంశాలపై చర్చ

  దక్షిణాదిలో కీలకంగా ప్రకాశ్ రాజ్

  దక్షిణాదిలో కీలకంగా ప్రకాశ్ రాజ్

  ప్రస్తుతం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌లో ప్రకాశ్ రాజ్ కీలక భూమికి పోషించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

  అప్పుడే మాటిచ్చిన ప్రకాశ్ రాజ్..

  అప్పుడే మాటిచ్చిన ప్రకాశ్ రాజ్..

  కాగా, ఇటీవల బడ్జెట్‌ సమావేశాల సమయంలో ప్రకాశ్‌రాజ్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గంటపాటు మాట్లాడారు. ఫ్రంట్‌ వెంట ఉంటానని, తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని అప్పుడు కేసీఆర్‌కు మాటిచ్చినట్లు తెలిసింది. తాజాగా, దేవెగౌడ, కేసీఆర్‌ భేటీలో ప్రకాశ్‌రాజ్‌ సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆయన సన్నిహితులు చెబున్నారు.

  కేసీఆర్‌కు మంచి మిత్రుడు

  కేసీఆర్‌కు మంచి మిత్రుడు

  ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ తనకు మంచి మిత్రుడని ఇటీవల బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన ఫ్రంట్‌లో ప్రకాశ్ రాజ్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన ప్రకాశ్‌రాజ్‌ సినిమా నటుడిగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు ప్రజలతో మంచి అనుబంధమే ఉంది. మొదటి నుంచి సెక్యులరిజం భావజాలం పట్ల ఆసక్తి చూపిస్తూ బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

  పూర్తి టైమ్.. తెలంగాణ నుంచి పోటీ?

  పూర్తి టైమ్.. తెలంగాణ నుంచి పోటీ?

  ఇది ఇలా ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మంగళూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు సమాచారం. అయితే,
  కేసీఆర్‌ పాలన పట్ల సానుకూల వైఖరితో ఉన్న ఆయన.. సీఎం కోరితే తెలంగాణ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్.. త్వరలోనే కేసీఆర్ ఫ్రంట్ కోసం పూర్తి సమయాన్ని కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా, కేసీఆర్‌తో కలిసి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

  ఇక తమిళనాడు వైపు కేసీఆర్..

  ఇక తమిళనాడు వైపు కేసీఆర్..

  ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేగాక, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తనయుడు స్టాలిన్‌తోనూ ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో కరుణానిధి-కేసీఆర్‌ భేటీ ఏర్పాట్లలో ప్రకాశ్‌రాజ్‌ ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉద్దేశాలను స్టాలిన్‌కు వివరించి ఆయన్ను ఒప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్ త్వరలోనే మాజీ సీఎం కరుణానిధి, డీఎంకే అధినేత కరుణానిధితో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Cine Actor Prakash Raj will play key role in Tlenagna CM And TRS president K Chandrasekhar Rao's Federal Front.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X