జేబులో చేతులతో ధీమాగా మారుతీరావు, నీ కూతురే నీకు ఉరిశిక్ష వేయమంటుందని అడగ్గా...
మంచిర్యాల: ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళారం మీడియా ఎదుట ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురిని మీడియా ముందుకు తీసుకు వచ్చారు. అమృత తండ్రి మారుతీరావు మినహా అందరు తలలు దించుకున్నారు. మారుతీ రావులో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు.

ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకొని
పోలీసుల మీడియా సమావేశం సందర్భంగా తన ప్యాంట్ జేబులో రెండు చేతులు పెట్టుకొని మనసు దృఢంగా ఉన్నట్లుగా కనిపించాడు. ఆయన తీరు చూస్తుంటే జైలు శిక్షకు ముందే సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రతి రోజు మనం ఎలా సాదాసీదాగా ఉంటామో, దర్జాగా ఉంటామో అలాగే ఉన్నాడు.

కేసు విచారణ సమయంలోను ఇలాగే
పోలీసులు కేసును విచారిస్తున్న సమయంలోనూ అతను అదే విధమైన హావభావాలతో ఉన్నట్టు చెబుతున్నారు. తన లక్ష్యం నెరవేరిందన్న భావన అతని ముఖంలో కనిపించిందని అంటున్నారు. ప్రణయ్ హత్యకు కుట్ర చేసిన మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌లు ఈ నాలుగు రోజుల్లో పక్కపక్కనే ఉన్నా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని, ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పోలీసులు చెప్పారు.
నీ కూతురే నిన్ను ఉరి తీయాలని చెబుతోంది కదా
ఇదిలా ఉండగా, పోలీసులు మారుతీరావును తీసుకు వెళ్తున్న సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి 'ఎందుకు చంపినవ్ చెప్పు.. ఎందుకు చంపినవ్ చెప్పు.. అల్లుడిని ఎందుకు చంపావ్.. చంపడానికి కారణం ఏమిటి.. మీ కూతురే నిన్ను ఉరి తీయాలని చెబుతుంది కదా... మీ కూతురు గురించి ఏమంటావ్... ' అని పదేపదే ప్రశ్నించారు.

పరువు తీస్తున్నారని
తన కూతురు అమృత.. ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వెడ్డింగ్ రిసెప్షన్ చేసుకొని వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తన పరువు తీస్తున్నారని చెబుతూ మారుతీ రావు.. ప్రణయ్‌ను హత్య చేయించిన విషయం కలకలం రేపింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications