హైకోర్టుకు ప్రత్యూష: సీఎం ఇంటికి తీస్కెళ్లండి, కెసిఆర్‌కు జడ్జి కితాబు
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష హైదరాబాదులోని గ్లోబల్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రత్యూషను హైకోర్టులో పోలీసులు బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో హాజరు పరిచనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యూష మీడియాతో మాట్లాడారు.
తనను చిత్రహింసలు పెట్టిన నాన్న, సవతి తల్లిని కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తిని కోరుతానని ఆమె చెప్పారు. తండ్రి రమేష్, తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

తాను బిఎస్సీ నర్సింగ్ చదివి పేదలకు సేవ చేస్తానని ప్రత్యూష చెప్పారు. బంధువుల వద్ద ఉండేందుకు ఆమె నిరాకరించారు. ప్రత్యూషను తాను తన ఇంటికి తీసుకుని వెళ్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రత్యూష చదువు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రత్యూషకు పూర్తి సహకారం అందించాలని, భద్రత కల్పించాలని ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు కూడా.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications