మేడారం మహా జాతర పనులు ఉధృతం..హైలెట్స్ ఇవే!
మేడారం మహా జాతర పనులు ఉదృతంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మేడారం మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 251 కోట్ల రూపాయలతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం గద్దెల విస్తరణకు 101 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నాలుగు వేల టన్నుల గ్రానైట్ తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులను చేపట్టారు.
మేడారం జాతర పనులలో వేగం
750 కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన ఏడు వేలకు పైగా శిల్పాలు రూపకల్పన చేశారు. 46 స్తంభాలతో 271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రాకారాన్ని నిర్మించారు. 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు.40 అడుగుల వెడల్పుతో మూడు స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణాన్ని నిర్మించారు. పూజారుల సంఘం ఆమోదంతో అన్ని పనులను వేగవంతం చేశారు.

వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల నిర్మాణం
గతంలో చూసిన మేడారానికి ప్రస్తుతం చూడబోయే మేడారానికి చాలా తేడా ఉంటుందని, మేడారం మహా జాతర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జరపడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మంత్రి సీతక్క లు పనులను పర్యవేక్షిస్తున్నారు. వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెలను శాశ్వతంగా నిర్మాణం చేశారు. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరగనున్న నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు.
అన్ని శాఖల పనులలో స్పీడ్
ఇదిలా ఉంటే మేడారం జాతరలో పాల్గొనే అన్ని శాఖలు పనులలో స్పీడ్ పెంచాయి. నేడు వచ్చే మేడారం జాతరను సమర్థవంతంగా నిర్వహించాలని మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. మేడారంలో ఏర్పాటుచేసిన పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో ఐజి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలివస్తారని, దానికనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఎంతో దూరం నుండి భక్తులు వస్తారని వారికి దర్శనం సాఫీగా జరిగేలా తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్ లలో,సెక్టార్ లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు అవసరమైన సిబ్బందిని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచన చేశారు.
మేడారం జాతరకు వైద్య శాఖ చేపట్టవలసిన చర్యలు
వైద్యశాఖ కూడా మేడారం మహా జాతరకు సన్నద్ధమవుతోంది. మేడారం మహా జాతరలో వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నేడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన చర్యలపై ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల డీఎంహెచ్వో లు, సూపరింటెండెంట్ లు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్తలు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
మేడారం జాతరకు స్పెషలిస్ట్ వైద్యులు
ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మేడారం జాతర విధులలో ప్రభుత్వ వైద్యశాలలలోని స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకోవాలని నిర్ణయించారు. ములుగు జిల్లాకు దగ్గరగా ఉన్న ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కళాశాలల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల స్పెషలిస్ట్ వైద్యులను డిప్యుటేషన్ చేసుకోవాలని నిర్ణయించారు. వైద్య సిబ్బందిని, టెక్నీషియన్లను పూర్తిస్థాయిలో డిప్యూట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications