నాన్నా! క్షమించి, నావల్ల అవమానం: అమ్మాయితో గంటలతరబడి మాట్లాడుతున్నాడని..

హైదరాబాద్: భాగ్యనగరంలో దారుణం జరిగింది. సెల్ ఫోన్‌లో యువతితో ఎక్కువగా మాట్లాడుతున్నాడని, ఆమెన వేధిస్తున్నాడని ఓ పూజారిని భవానీ మాల తీయించి మరీ తండ్రి సమక్షంలో కొట్టారు. మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ సంఘటన హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కానూరుకు చెందిన వాడపల్లి శ్రీనివాసాచార్యుల కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది.

Priest commits suicide after man handling

పద్మానగర్‌ ఫేజ్ 2 నారాయణ క్షేత్రంలో ఉంటూ, పౌరోహిత్యం చేస్తున్నారు. ఆయనకు భాస్కరాచార్యులు కొడుకు. ఇతని వయస్సు 26. ఇతను దగ్గరలోని సాయిబాబా గుడిలో పురోహితుడిగా పని చేస్తున్నాడు. ఇతను సమీపంలోని ఓ యువతితో సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఆదివారం పంచాయితీ పెట్టారు. ఒకరితో మరొకరు మాట్లాడకుండా ఒప్పంద పత్రం రాయించుకున్నారు.

అనంతరం, సోమవారం పలువురు పెద్ద మనుషులు.. తండ్రి శ్రీనివాసాచార్యులు, కుమారుడు భాస్కరాచార్యులును స్థానిక పాఠశాలకు పిలించారు. భవానీ మాల దీక్షలో ఉన్న మాల తీయించి భాస్కరాచార్యుల పైన చేయిచేసుకున్నారు.

దీంతో మనస్తాపానికి గురైన భాస్కరాచార్యులు ఇంటికి రాగానే గదిలోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్న, నన్ను క్షమింపండి, నా వల్ల మీకు అవమానం జరిగింది.. జై దుర్గామాత అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+