Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోడీ టార్గెట్: బీజేపీ అచీవ్‌మెంట్స్ పేరుతో షాకింగ్ ఫ్లెక్సీలు!!

తెలంగాణ రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ కు, ప్రతిపక్ష బీజేపీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే సికింద్రాబాద్ ప్రాంతంలో బిజెపికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఫ్లెక్సీలపై ఎటువంటి పార్టీ ప్రచార గుర్తులు లేకపోయినా, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఉన్న వివిధ అంశాలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టంగా సూచిస్తున్నాయి. బిజెపి అచీవ్మెంట్స్ పేరుతో భారతదేశం మ్యాప్ ను గీసి ఆయా రాష్ట్రాలలో దర్యాప్తు సంస్థలు దాడులకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్స్ ఒక ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు.

Prime Minister Modi target

దేశవ్యాప్తంగా బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయించడం తప్ప చేస్తున్న గొప్ప పనులేమీ లేవని తెలియజేసే విధంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక మరో ఫ్లెక్సీలో పరివార్ వెల్కమ్స్ యూ మోడీజీ అనే పేరుతో బిజెపిలో వారసత్వ రాజకీయాలకు సంబంధించిన నేతల ఫోటోలను వారి పేర్లను ముద్రించి, బిజెపి వారసత్వ రాజకీయాలను టార్గెట్ చేశారు.

ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్న ప్రధాన నరేంద్ర మోడీ 11వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇప్పటికే ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమంలో తాను పాల్గొనబోనని హాజరు కాకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించుకోగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతోపాటు మోడీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేసి రచ్చ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+