Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Narendra Modi: తెలంగాణలో మూడు రోజులు ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వారు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతుంది. ఇప్పటికే పలు ధఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి తెలంగాణకు రానున్నారు. మూడు పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

నరేంద్ర మోడీ ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 గంటలకు తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుంటారు. రాత్రికి శ్రీరచనా అతిథి గృహంలో బస చేస్తారు.

Prime Minister Narendra Modi will visit Telangana for 3 days

27వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకుని.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రోడ్డు షోలో కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముందు మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని 2:05 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు.
సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని రాత్రి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజ్ భవన్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు.

26వ తేదీ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాక ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం నిర్మల్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి పయనమవుతారు. 27వ తేదీన తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు.సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ఢిళ్లీ వెళ్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+