ఉపాధ్యాయురాల్ని వేధించిన ప్రిన్సిపల్ సస్పెన్షన్

హైదరాబాద్: ఆదిలాబాద్‌ జిల్లాలోని బోధ్‌ గిరిజన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిని ప్రధానోపాధ్యాయుడే వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో చేకం ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్‌ మంగళవారం నాడు సస్పెండ్‌ చేశారని తెలుస్తోంది.

హోంగార్డు అరెస్ట్

గొలుసు చోరీలకు పాల్పడుతున్న హోంగార్డును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హోంగార్డు మహేంద్ర సింగ్‌తో పాటు మరో నిందితుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అదిలాబాద్ జిల్లాలో దారుణం

Principal suspended for harassing teacher

అదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోట మండలంలో దారుణం జరిగింది. తన కొడుకు భీమా డబ్బు మొత్తం కోడలికి వస్తుందని తెలుసుకున్న అత్తామామలు, ఆమెను చంపారు.

పని చేసిన సంస్థకు టోకరా

మెదక్ జిల్లాలో దుర్గేష్ అనే వ్యక్తి పని చేస్తున్న సంస్థకే టోకరా వేశారు. బ్యాంకులో డబ్బులు జమ చేయకుండానే చేశానని చెప్పాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుర్గేష్ దానిని జమ చేయలేదని తెలిసింది. దీంతో అతనిని అరెస్టు చేశారు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

దురగ్ేష్, కృష్ణష పని చేసిన సంస్థకు టోకరా, బ్యాంకులో డబ్బులు జమ చేయకుండా చోరీకి, సీసీటీవీ ఫుటేజ ీ ఆధారంగా,

నష్టపోయిన పంటలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి మెదక్ జిల్లా కోహిర్‌ మండలంలో నష్టపోయిన పంటలను జాయింట్‌ కలెక్టర్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షంతో తీవ్రంగా నష్టపోయిన మామడి, ఉల్లి, జొన్న, మొక్కజొన్న, అరటి తదితర పంటలను వారు పరిశీలించారు. కాగా, కరీంనగర్ జిల్లాలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్యాయత్నం

భార్య కాపురానికి రావడం లేదంటూ ఓ భర్త ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. నగరంలోని గాజువాక పోలీసు స్టేషనులో ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఇతను భార్య కాపురానికి రావడం లేదంటూ పలుమార్లు చేయి కోసుకున్నాడని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+