ప్రయివేటు స్కూల్స్ ఫీజుల వేట షురూ.!సీబీఎస్సీ రద్దుతో ఆఘమేఘాల మీద పరీక్షలు.!అయోమయంలో విద్యార్ధులు.!
హైదరాబాద్ : సందెట్లో సడేమియా అంటే ఇదే అనే విధంగా వ్యవహరిస్తున్నాయి తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థలు. కోవిడ్ మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న తరుణంలో ముక్కుపచ్చలారని చిన్నారులెవ్వరూ దానికి బలవ్వకూడదనే సదుర్దేశంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సిలబస్ తో నడిచే పదవ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. దీంతో ఎక్కడ పదో తరగతి పరిక్షలను గతేడాది రద్దు చేసినట్టు ఈ ఏడాది కూడా రద్దు చేస్తారోనని ప్రయివేటు పాఠశాలలు అప్రమత్తమయినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడిన మరుక్షణం నుండే తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థలు పరీక్షలు, ఫీజుల పేరుతో హడావిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

విద్యాసంవత్సరంపై కరోనా ప్రభావం.. అయోమయంలో విద్యార్థులు..
కరోనా సెంకండ్ స్ట్రెయిన్ అత్యంత దారుణంగా విస్తరించడమే కాకుండా ప్రాణాంతకంగా పరిణమించిన అంశం తెలిసిందే. చాలా వరకు రాష్ట్రాలు రాత్రిపూట కర్ప్యూ విధించడంతో పాటు మళ్లీ కంటెయిన్మెంట్ ప్రాంతాలుగా విభజించి కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నయంటే ఎంతటి ప్రభావం ఉందో తెలిసిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు తప్పని సరి చేయడంతో పాటు అకారణంగా బయటకు వస్తే జరిమానాలు విధించే వరకూ ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మద్యప్రదేశ్, కర్ణాటక, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షల దిశగా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రధానంగా చిన్నపిల్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందును పాఠశాలలు, పరీక్షల నిర్వహణపై ఆయా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఫీజులకోసం ప్రయివేటు విద్యాసంస్థల ఆరాటం.. భవిత కోసం విద్యార్థుల పోరాటం..
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సెంట్రల్ సిలబస్ తో కూడుకున్న పదోతరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం బుదవారం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అప్రమత్తమయిన తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థల యజమానులు పరీక్షల పేరుతో హడావిడిచేయడం కనిపించింది. విద్యాసంస్థలు తరగతులను ప్రారంభించుకోవచ్చని ప్రకటించిన రెండువారాల్లోనే కరోన విజృంభించడంతో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు తెలంగాణ ప్రకటించక తప్పలేదు. ప్రస్తుతం కరోనా ఉగ్రరూపం చూపిస్తున్న తరుణంలో విద్యార్థుల భవితపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. సెకండ్ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన తరుణంలో చిన్నారుల భవితపట్ల సర్వత్రా ఆందోలన వ్యక్తం అవుతోంది.

గతేడాది అర్థాంతరంగా విద్యసంవత్సరం రద్దు.. ఈ సారి అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలు..
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఫీజులకోసం కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు చిన్న పిల్లలను పాటశాలలకు పిలుపించుకుని, క్లాస్ టెస్టులని, యూనిట్ టెస్టులని, ఆన్ లైన్ లో పరీక్షలని హడావిడిచేయడం గమనార్హం. పరీక్ష రాయాంటే ఫీజులు కట్టాలని చిన్నారుల మీద ఒత్తిడి తెస్తున్న ప్రయివేటు పాఠశాలలు అనేకం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ నియమనిబంధనలకు విరుద్దంగా ప్రయివేటు విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయని విద్యార్థులతో పాటు పాఠశాలలకు వస్తున్న పేరెంట్స్ వాపోతున్నట్టు తెలుస్తోంది. ఫీజుల అంశంలో ప్రభుత్వ నియమాలకనుణంగా వ్యవహరిస్తామని కొంతమంది తల్లిదండ్రులు వాపోతున్నట్టు తెలుస్తోంది.

ఫీజులు చెల్లించాల్సిందే నంటున్న విద్యాసంస్థలు.. వామ్మో ఎలా అంటున్న పేరెంట్స్..
ఇదిలా ఉండగా గతేడాది విద్యాసంవత్సరం కారోనా కారణంతో అకస్మాత్తుగా మూతపడిపోవడంతో చాలా వరకూ ఫీజులు పెండిండ్ ఉన్నట్టు పాఠశాలల యాజమాన్యాలు చెప్పుకొస్తున్నాయి. అయితో తరగతుల నిర్వహణే లేనప్పుడు ఫీజులు ఎలా చెల్లిస్తామని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. తాజాగా కరోనా మరోసారి చెలరేగి పోతున్న సందర్బంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకునే అధికారాలను కూడా కేంద్రం రాష్ట్రాలకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఫీజుల అంశంలో అప్రమత్తంగా ఉండాలన్నది ప్రయివేటు విద్యాసంస్థల వ్యూహంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications