షర్మిలకు కాబోయే కోడలితో వైఎస్ విజయమ్మ: అపురూపమైన కానుక
YS Raja Reddy: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతుల తనయుడు వైఎస్ రాజా రెడ్డి (YS Raja Reddy) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
పెళ్లి కూతురి పేరు ప్రియా అట్లూరి (Priya Atluri). చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉంది. వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. నాలుగు సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారు.

ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి.. అమెరికాకు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమ వివాహానికి అటు వైఎస్ షర్మిల- అనిల్ కుమార్ దంపతులు, ఇటు ప్రియ అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీనితో వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.
వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరిది కులాంతర వివాహం అవుతుంది. వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహమేననే విషయం తెలిసిందే. ఆమె భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వచ్చే ఏడాది మేలో వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేసుకున్నాడు వైఎస్ రాజా రెడ్డి. యూనివర్సిటీ నుంచి ఇదివరకు పట్టా అందుకున్నారు. కాన్వకేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల దంపతులు ఇదివరకు అమెరికా వెళ్లారు.
కాగా తాజాగా ప్రియ అట్లూరి.. వైఎస్ విజయమ్మను కలిసినట్లు తెలుస్తోంది. లోటస్ పాండ్‌లోని ఇంటికి వచ్చిన ప్రియను ఆప్యాయంగా స్వాగతించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియ అట్లూరికి రెండు జతల బంగారు గాజులను ప్రజెంట్ చేశారు విజయమ్మ. తానే స్వయంగా వాటిని తొడిగారు.












Click it and Unblock the Notifications