కాంగ్రెస్ పుంజుకున్నా, అక్కడ మాత్రం - సర్వే రిపోర్ట్, ఇలా ముందుకెళ్దాం..!!
తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ పైన కాంగ్రెస్ గురి పెట్టింది. ఇందు కోసం కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఈ నెల 30న పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రియాకం ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీలో చేరికలకు ముహూర్తం ఖరారైంది. పార్టీ ఎక్కడ వెనుకబడి ఉందో పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు నేతలకు వివరించారు. ఆగస్టు 15న ఖర్గే అధ్యక్షత సభకు నిర్ణయించారు.
బీసీ ఓటింగ్ పై ఫోకస్:
రానున్న ఎన్నికల్లో బలాలు..బలహీనతలపైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. రానున్న వంద రోజులు ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు ఏం చేయనున్నామనే విషయాన్ని ఆ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల సంక్షేమం, అభివృద్ధికి కూడా ఏం చేయాలన్నదానిపైనా డిక్లరేషన్లు పూర్తి చేసి ప్రచార కార్యాచరణలో దిగాలన్న నిర్ణయం జరిగింది. ఈ డిక్లరేషన్ల రూపకల్పనకుగాను నిపుణులతో సబ్ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రియాంక - ఖర్గే సభలు:వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఆగస్టు 15న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ నిర్వహించనున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరగనున్న సభలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్ ఏం చేయనున్నది వివరిస్తూ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ నెల 30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ హాజరు కానున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పీఏసీ సమావేశంలో తెలిపారు. ఆ సభలో ప్రముఖల చేరికలకు ముహూర్తంగా నిర్ణయించారు.
పార్టీ అక్కడ వెనుకంజ:ప్రియాంక సభలోనే మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. బీసీ గర్జన సభను ఏర్పాటు చేసి, దానికి రాహుల్‌తోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కూడా ఆహ్వానించాలని వీహెచ్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలోనే పార్టీ వ్యుహకర్త సునీల్ కనుగోలు రాష్ట్రంలో ఎంపీ స్థానాల వారీగా పార్టీ బలాబలాలపై నివేదికను చదివి వినిపించారు. ఐదు ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ కాస్త వెనకబడి ఉందని తెలిపారు.
మిగతా చోట్ల పార్టీ బాగా మెరుగుపడిందని, అధికారంలోకి వస్తామని అన్నారు. ఆ ఐదు ఆ స్థానాల్లో కూడా పార్టీని మెరుగుపరచుకోవాలని సూచించారు. నేతల మధ్య అంతరాలున్నాయని, సంప్రదింపుల ద్వారా వాటిని తొలగించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications