ప్రజా పాలన విజయోత్సవాల వేళ.. తెలంగాణలో మరో కీలక నియామకం: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. !!
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనుంది ప్రభుత్వం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ఈ వేడుకలనూ నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 7,8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఉత్సవాలను జరుపుకోనుంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.

సచివాలయంలో నిర్మితమౌతోన్న తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని 9వ తేదీన ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అదే రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పరిస్థితుల మధ్య విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించింది. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతిగా అపాయింట్ చేసింది.
ఈ మేరకు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. గవర్నర్, ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ ఆదేశాల మేరకు ఘంటా చక్రపాణిని బీఆర్ఏఓయూ వైస్ ఛాన్సలర్‌గా నియమించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చక్రపాణి ఇదే యూనివర్శిటీలో సోషియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు.
ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోలాజికల్ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి సోషియాలజీ ఆఫ్ రిలిజియన్‌లో పీహెచ్‌డీ చేశారు. సోషియాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు.
విద్య, ఉద్యోగ రంగానికి సంబంధించినంత వరకు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న మరో కీలక నియామకం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications