'నిన్న గాక మొన్న వచ్చి.., లీడర్ అని నువ్వనుకుంటే సరిపోతుందా?, రేవంత్ ను కట్టడి చేయండి'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవిని ఆశించే ఆశావహుల సంఖ్య చాంతాడంత ఉంటుంది. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకె అరుణ.. ఇలా ఈ జాబితా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే అన్న ప్రచారం ఉంది.

ఇలా సీనియర్లంతా ఎప్పుడెప్పుడు తమకు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తుంటే... నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడి వారికి మంటపుట్టిస్తోందట. చిన్నా చితకా పదవులేవి తనకు వద్దని, మంత్రి పదవి కూడా తన స్థాయికి తగదని, చేస్తే.. గీస్తే.. సీఎం పదవే చేపడుతానని రేవంత్ చెప్పడం వారికి మింగుడుపడటం లేదట.

ఆర్నెళ్లు కాలేదు.. అప్పుడే పదవులా?:

ఆర్నెళ్లు కాలేదు.. అప్పుడే పదవులా?:

పార్టీకి సరైన మార్గదర్శనం కరువైందన్న రీతిలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో అంతర్గతంగా విమర్శలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సరైన సలహాలిచ్చేవారు లేరనడం పార్టీలో నేతలందరినీ అవమానపరచడమేనని సీనియర్లు భావిస్తున్నారట. పార్టీలో చేరి ఆర్నెళ్లు కూడా కాకముందే అప్పుడే పదవుల గురించి మాట్లాడటమేంటని రేవంత్ పై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారట.

టీడీపీలోనే ఉండాల్సింది!:

టీడీపీలోనే ఉండాల్సింది!:

ముందు పార్టీ గెలుపు కోసం అందరినీ కలుపుకుని పోయి కష్టపడి చేయాలని, ఎన్నికల్లో గెలిచాక సీఎం పదవి గురించి ఆలోచించాలే తప్ప.. ఇప్పుడే దాని గురించి చర్చ ఏంటని సీనియర్లు విమర్శిస్తున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే కావాలనుకుంటే టీడీపీలోనే ఉంటే పోయేది కదా.. కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చినట్టు? అని బాహాటంగానే విమర్శిస్తున్నారట. రేవంత్ తనకు తాను నాయకుడిని అని చెప్పుకుంటే సరిపోదు, ప్రజలు గుర్తించాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.

 పార్టీకి డ్యామేజ్?:

పార్టీకి డ్యామేజ్?:

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఓటుకు నోటు కేసు భారాన్ని తాము కూడా మోయాల్సి వస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రేవంత్ కు మేమంతా రక్షణగా నిలవాలనుకుంటే.. ఆయన మాత్రం ఇవేవి ఆలోచించుకుండా పార్టీని డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేస్తున్నారని మరో కాంగ్రెస్ నేత అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

 కుంతియాకు ఫిర్యాదు:

కుంతియాకు ఫిర్యాదు:


రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాకు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఆయనకు వివరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ ను కట్టడి చేయాలని ఆయన్ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుంతియా.. రేవంత్ తో తాను మాట్లాడుతానని చెప్పినట్టు సమాచారం. అయితే రేవంత్ వ్యవహారాన్ని ఇక్కడితో విడిచిపెట్టకుండా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+