టిడిపిలోనే ఉంటా, మహానాడుకు ఎప్పుడు వెళ్లను: ఆర్ కృష్ణయ్య
తాను ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. తాను బిజెపిలో చేరుతానన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
హైదరాబాద్: తాను ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. తాను బిజెపిలో చేరుతానన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
తాను బిజెపిలో చేరుతున్నానని సోషల్ మీడియాలో, బయటా ప్రచారం జరుగుతోందన్నారు. కానీ అవన్నీ ఊహాగానమేనని ఆయన స్పష్టం చేశారు. మహానాడుకు వెళ్లకపోవడంపై ప్రశ్నించగా.. తాను ఎప్పుడు మహానాడుకు వెళ్లలేదని తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి తన కుమారుడిని ఆశీర్వదించేందుకు వచ్చారే తప్ప, తమ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు.
బీసీ బిల్లు కోసం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలోనే బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశానన్నారు. ప్రధాని మోడీకి బిసి సంఘాలు అండగా ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications