తుక్కుగూడ జనజాతర సభపై రాహుల్ గాంధీ స్పెషల్ ట్వీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. శనివారం సాయంత్రం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సభ విజయవంతం కావడంపై స్పందించారు. తుక్కుగూడ జన జాతరసభ తనకు సంతోషాన్ని ఇచ్చిందని రాహుల్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వీడియో విడుదల చేశారు. చాలా మంది జనం హాజరైన సభలో మేనిఫెస్టో విడుదల చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల గళమని, మేనిఫెస్టోకి సంబంధించి తమ తమ అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకోవాలని సూచించారు. హ్యాష్‌ట్యాగ్ కాంగ్రెస్ మేనిఫెస్టో(CongressManifesto) పేరిట పంచుకోవాలని కోరారు రాహుల్ గాంధీ.

కాగా, సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్రం వేదికగా విడుదల చేయాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల ఢిల్లీలోనే విడుదల చేశారు.

"నేను గత రాత్రి 12:30 గంటలకు ఈ వీడియో చేసాను, కానీ పోస్ట్ చేయడం చాలా ఆలస్యమైందని నా బృందం భావించింది 🙄 సందేశం ఇప్పటికీ సంబంధితంగా ఉన్నందున నేను ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను :)
— Telangana Congress (@INCTelangana) April 7, 2024
కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది ప్రతి భారతీయుడి వాయిస్, మీ ఆలోచనలను సోషల్ మీడియాలో పంచుకోండి."
- శ్రీ… pic.twitter.com/1uHTI5qqTD
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సభ నిర్వహించి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని మొదట్నుంచీ భావించింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6వ తేదీన జన జాతర సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 10 లక్షల మంది హాజరైన జన జాతర సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో తెలుగు ప్రతిని కూడా విడుదల చేశారు. ప్రత్యకంగా తెలంగాణకు పలు కీలక హామీలను ఇందులో పొందుపర్చారు. మరోవైపు, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications