కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ
హైదరాబాద్: ప్రజల తెలంగాణ.. దొరల తెలంగాణకు మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని.. అందులో వాస్తవం లేదన్నారు రాహుల్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ. 15 వేలు అందిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ. 12 వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను ఈ పర్యటనకు వచ్చానని రాహుల్ వెల్లడించారు.

మనది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధమని రాహుల్ వ్యాఖ్యానించారు. కొల్లాపూర్ సభకు తప్పక వస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు.. అందుకే టికెట్ల విషయంలో ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నా.. సభకు హాజరైనట్లు తెలిపారు. ఓ వైపు సీఎం కేసీఆర్ కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని పేర్కొన్నారు రాహుల్.
దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాహుల్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏడాది కాకుండానే బ్యారేజీలు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో చారిత్రాత్మక సంస్థలను, ప్రాజెక్టులను నెలకొల్పిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్ము దోపీడీ చేశాయని ఆరోపించారు.
ధరణి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు రాహుల్. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ధరణి వల్ల కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే లాభం జరిగిందని.. దాని వల్ల రైతులకు ఎలాంటి లాభం ప్రయోజనం లేదన్నారు రాహుల్. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.
LIVE: Public Meeting | Vijayabheri Yatra | Nagarkurnool, Telangana https://t.co/6N90kah0UI
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2023
తెలంగాణ రాష్ట్ర సంపద పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే పోతున్న విషయం ప్రజలందరూ గమనించాలని రాహుల్ కోరారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని.. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై మాత్రం ఎలాంటి దర్యాప్తు జరగడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంపదను ప్రజలకు చేరేలా చూస్తామన్నారు. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications