కాంగ్రెస్ శ్వాస - ప్రజా సమస్యలపైనే ధ్యాస..!!

మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో గల్లీ వరకు మార్మోగుతున్న పేరు. కర్ణాటక తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారం అని చెబుతున్న సమయంలోనే..భట్టి పేరు ప్రస్తావిస్తున్న అరుదైన సందర్భం. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ నుంచి సన్మానం అందుకుంటున్న భట్టి వైపు ఇప్పుడు యావత్ భారత కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. అయిదు దశాబ్దాల కాంగ్రెస్ రాజకీయంలో భట్టి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పీపుల్స్ మార్చ్ తో లీడర్ గా మారిన భట్టి ప్రతీ అడుగు స్పూర్తి దాయకమే.

భట్టి కుటుంబానికి కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. నాడు ఇందిరా గాంధీ నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు పార్టీకి విధేయులుగా నిలిచారు. ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ద్వారా రాహుల్ ప్రశంసలు.. సత్కారం అందుకుంటున్న భట్టి విక్రమార్క్ అన్నలను మించిన తమ్ముడిగా నిలిచారు. తొలి నుంచి కాంగ్రెస్. తుది శ్వాస వరకు కాంగ్రెస్ అన్నదే ఆ ఇంట నినాదం.

Rahul Gandhi to felicitate Bhatti Vikramarka in Khammam metting

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా...చీఫ్ విప్ గా.. ఉప సభాపతిగా.. సీఎల్పీ నేతగా పని చేసిన మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు పీపుల్స్ లీడర్ గా నిలిచారు. తెలంగాణ కాంగ్రెస్ ను అధికారం వైపు తీసుకెళ్లేలా తన పీపుల్స్ మార్చ్ తో అడుగులు ప్రారంభించారు. ఆ అడుగులే ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలకు పదఘట్టంగా మారింది. కాంగ్రెస్ జైత్రయాత్రకు నాంది ప్రస్థానంగా నిలిచింది.

భట్టి విక్రమార్క మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ హయాంలో చీఫ్ విప్ గా పని చేసారు. ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్ర విభజన సమయంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ సాధన పోరాటంలో క్రియాశీలకంగా మారారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకోవటం ..పార్టీ నాయకత్వాన్ని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనేలా ఒప్పించే మంత్రాంగంలో భాగస్వాములయ్యారు.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రతీ సందర్భంలోనూ సభలోనూ..బయటా ప్రభుత్వాన్ని నిలదీసారు. సీఎల్పీ నేతగా నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి సమస్యల పైన పోరాటం చేసారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ సందర్భంలోనూ వారిలో అభద్రతా భావం..నిరాశ లేకుండా ప్రయత్నాలు చేసారు.

Rahul Gandhi to felicitate Bhatti Vikramarka in Khammam metting

కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు అండగా నిలిచారు. కరోనా రక్కసి విరుచుకుపడుతున్న వేళ నేరుగా బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం దమన నీతిని భట్టి నిలదీసిన తీరు సంచనలంగా నిలిచింది.

కేంద్ర తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ రైతు కవాతులో ముందుండి నడిపించారు. రైతుల గొంతుకగా నిలిచారు. డబుల్ బెడ్ రూమ్స్ విషయంలో భట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు లబ్ది దారులకు వరంగా మారింది. నేరుగా మంత్రి తలసాని భట్టి ఇంటికి వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పెరిగిపోతున్న నిత్యావసరాలు..పెట్రో ఉత్పత్తుల ధరలకు వ్యతిరేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సైకిల్ యాత్ర రాష్ట్ర చరిత్రలోనే నిలిచింది.

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన..2018లో నిర్వహించిన ఆత్మ గౌరవ యాత్ర.. మరియమ్మ లాకప్ డెత్ అంశంలో భట్టి పోరాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. 2019లో అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రైతు యాత్ర నిర్వహించారు. 2019లో సైకిల్ యాత్ర చేసారు. 2019లో రెండు వేల ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది.

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా భట్టి ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. ఇవన్నీ కాంగ్రెస్ నేతగా భట్టి చేసిన పోరాటంలో కొన్ని మాత్రమే. తాజాగా తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పేరుతో జనంతో మమేకం అయ్యారు. జన ప్రభంజనం స్రుష్టించారు. నిరంతర యాత్రతో కాంగ్రెస్ జైత్రయాత్రకు జై కొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+