విషాదం: రైలు ఢీకొని ఢిగ్రీ విద్యార్థినితోపాటు ముగ్గురు మృతి
కామారెడ్డి: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతుండగా.. వేగంగా వచ్చిన గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో డిగ్రీ విద్యార్థినితోపాటు ముగ్గురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని బోయిని నవ్య(19) కామారెడ్డిలోని కళాశాలకు వెళ్లే నిమిత్తం.. కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే ప్యాసింజర్ ఎక్కారు. లింగంపేట్‌కు చెందిన బాలవ్వ(60), మెదక్ జిల్లా జాన్సిలింగాపూర్‌కు చెందిన ఆమె మనవడు(కుమార్తె కుమారుడు) సర్వేంద్ర(3)తో ఇదే రైలులో ప్రయాణించారు.

ఈ ముగ్గురూ కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో దిగారు. తమ గమ్యాలకు చేరుకోవాలనే ఆతృతలో పట్టాలు దాటుతుండగా.. నిజామాబాద్ వైపు వెళ్లే గూడ్స్‌రైలు ఢీకొంది. నవ్య, సర్వేంద్ర ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. బాలవ్వ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. ముగ్గురి మృతితో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications