తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్, రూట్ - ఇక నేరుగా..!!
తెలుగు రాష్ట్రాలకు మరో కొత్త రైల్వే ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. సీఎం రేవంత్ వినతి మేరకు రైల్వే శాఖ ఈ కొత్త ప్రాజెక్టు పైన కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త లైన్ సర్వేకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు ను రైల్వే శాఖ వంద శాతం నిధులతో పూర్తి చేయాలని రేవంత్ కోరారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైన వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ప్రయోజనంగా మారనుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది. కల్వకుర్తి-మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన చర్యలు వేగవంతం అవుతున్నాయి. దీని ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసింది. తాజాగా ఈ అంచనా వ్యయం రూ.2,520 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన ఒక్కో కిలోమీటర్‌కు రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వరకు ఈ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని సీఎం రేవంత్ గతంలోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో దక్షణ మధ్య రైల్వే నుంచి రైల్వే బోర్డుకు లేఖ వెళ్లింది. కల్వకుర్తి-మాచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా ఉంది. ఈ లేఖతో కల్వకుర్తి మాచర్ల ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు, ప్రాజెక్టు నిర్మాణ దిశగా కీలక నిర్ణయం తీసుకొనే అవకావం ఉంది.
ఈ ప్రతిపాదిత మార్గంలో ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఈ మార్గంలోని భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్ అంచనాలను ఖరారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులతో చేపట్టాలని సీఎం కోరారు. కల్వకుర్తి-మాచర్ల మార్గానికి ఎఫ్ఎల్ఎస్ మంజూరై ఆ తర్వాత కేంద్రం నిధులిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా, వ్యాపారం, పర్యాటకరంగాలకు ఊతం లభిస్తుంది.
తెలంగాణ నుంచి మాచర్ల మీదుగా గుంటూరుకు రైలు మార్గం అనుసంధానం అవుతుంది. ఇది తెలంగాణ, ఏపీ మధ్యలో మరో కీలక మార్గం అవుతుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వంతోనూ మాట్లాడాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని తెలుగు రాష్ట్రాల్లో సరుకు రవాణా రైళ్ల నిర్వహణ సదుపాయాల విస్తరణ, కొత్తగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు రూ.1,361 కోట్లు విలువైన నిధులు తాజాగా మంజూరు చేసారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications