కరీంనగర్-తిరుపతి రైలు: బండి సంజయ్ చొరవ; ప్రయాణికులకు శుభవార్త!!
కరీంనగర్ వాసులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వే. కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు వారంలో నాలుగు రోజుల పాటు రైలును నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది .ప్రస్తుతం ఆదివారం గురువారం మాత్రమే నడుస్తున్న ఈ రైలు ఇకపై వారంలో నాలుగు రోజుల పాటు నడవనున్నట్టు తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందించారని బండి సంజయ్ వెల్లడించారు.
నేడు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి కరీంనగర్ జిల్లాలోని అనేక రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాల పైన చర్చించిన బిజెపి ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలుకు ఉంటున్న విపరీతమైన రద్దీ దృష్ట్యా వారంలో నాలుగు రోజులు పాటు పొడిగించాలని కోరానని తెలిపారు.

అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు . ప్రస్తుతం ఆదివారం, గురువారం రోజుల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలు, మరో రెండు రోజులు పొడిగిస్తున్న క్రమంలో ఏ ఏ రోజులలో ఈ రైలు నడుస్తుంది అన్నదాని పైన రెండు రోజుల్లో అధికారులు ప్రకటన చేయనున్నట్టు తెలిపారు.
ఇక ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజ కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి, రైల్వే లైన్ పనులను మంజూరు చేయాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరగా, రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇక జమ్మికుంట నగరానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో జమ్మికుంటలో పలు రైళ్ల హాల్టింగ్ పై రైల్వే మంత్రికి ప్రతిపాదన పెట్టారు బండి సంజయ్. సికింద్రాబాద్ నుండి వెళ్లే గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ నుండి న్యూ ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుండి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్, చెన్నై నుండి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక దీనిపైన కూడా సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సాధ్యా సాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంటలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాలను బండి సంజయ్ వెల్లడించి కేంద్ర రైల్వే శాఖ చూపిస్తున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications