ఏపీ మీదుగా సికింద్రాబాద్ నుంచి ఈ రూట్ లో ప్రత్యేక రైలు పొడిగింపు
దసరా, దీపావళి పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
దాన్ని కొనసాగిస్తూ తాజాగా మరో రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించారు.. దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్- నహర్లగున్ మధ్య నడిచే డైలీ బతుకమ్మ ప్రత్యేక రైలును నవంబర్ 10వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ రైలు నవంబర్ 6వ తేదీ వరకే అందుబాటులో ఉండాలి. దీపావళి రద్దీని కూడా ఏర్పడటంతో దీన్ని 10వ తేదీ వరకు పొడిగించారు.

సికింద్రాబాద్- నహర్లగున్ ఎక్స్ ప్రెస్
- నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరే నంబర్ 07046 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 4 గంటలకు నహర్లగున్ కు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో నవంబర్ 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నహర్లగున్ నుంచి బయలుదేరే నంబర్ 07047 ప్రత్యేక రైలు మూడో రోజు రాత్రి 9:50 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
- చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, నరాజ్ మార్థాపూర్, జైపూర్ కియొంఝర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్, అందూల్, డంకుణి, బర్ధమాన్, బోల్ పూర్ శాంతినికేతన్, రామ్ పూర్ హట్, మాల్దా టౌన్, కిషన్ గంజ్, ఆలువాబరి రోడ్, న్యూ జల్ పాయ్ గురి, న్యూ కూచ్ బెహార్, కోక్రాఝర్, న్యూ బొంగైగావ్, బర్పేట రోడ్, రంగియా, రంగపారా నార్త్, హర్ముటి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్
- నవంబర్ 6వ తేదీ నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12:10 నిమిషాలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరే నంబర్ 07711 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో.. నేటి నుంచి 25వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బయలుదేరే నంబర్ 07712 ప్రత్యేక రైలు రాత్రి 11:15 నిమిషాలకు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సికింద్రాబాద్ కే పరిమితం కావట్లేదు. నాంపల్లి స్టేషన్ వరకూ వెళ్తుంది.
- చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications
