అల్పపీడన ప్రభావం.!రాగల రెండు రోజులు తెలంగాణలో వర్షాలు.!
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడనుందని తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా మారనుందని, వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికల్లా ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణలోకి చల్లని గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Recommended Video
అంతే కాకుండా గురువారం రాత్రి, శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురువారం రాత్రి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. ఇక శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ ప్రజలు అప్రత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుజాగ్రత్తులు తీసుకోవాలని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications