జాగ్రత్త.. తెలంగాణాను ముంచెత్తబోతున్న వానలు!!

తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ నుండి ప్రవహిస్తున్న కృష్ణ, గోదావరి నదులకు వరద కొనసాగుతుంది. వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్ మినహాయించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.

తెలంగాణలో వర్షాలు ఈ జిల్లాలలోనే
ఇదిలా ఉంటే నేడు కూడా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్నగర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి జిల్లాలలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

rains update today moderate rains in these districts in telangana IMD alert

నేటి నుండి ఐదు రోజులు వర్షాలు
ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వాగులు, పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మళ్లీ నేటినుండి ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నేడు వర్షాలు ఇలా
ఈరోజు సాయంత్రం 5 తర్వాత ఉత్తర, పశ్చిమ తెలంగాణ, హైదరాబాద్ లలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాత్రి ఉత్తర తెలంగాణా వ్యాప్తంగా వర్షాలకు ఛాన్స్ ఉంది. వరుసగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే రుతుపవనాలతో పాటు ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగాను, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుఫాను కారణంగానూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వర్షాలతో జాగ్రత్త
ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. వర్షంలో మొబైల్ ఫోన్స్ వాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+