తప్పు చేయలేదు కదా, వంశం నిర్వంశమైంది: జైలు నుంచి విడుదలైన రాజయ్య
వరంగల్: కోడలు, మనవలు మరణించడంతో తన వంశం నిర్వంశమైందని కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య శుక్రవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు.
రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కు గు రువారం నాల్గవ అదనపు మున్సిఫ్‌కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల చేశా రు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడనివ్వకుండా రాజయ్యను తీసుకుని వెళ్లడానికి ఆయన బంధువులు ప్రయత్నించారు.

అయితే, రాజయ్య తానేమీ తప్పు చేయలేదు కదా అంటూ మీడియా ముందుకు వచ్చారు. తన వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలుసని, కోడలు, మనుమలు మృతిచెందడం దురదృష్టకరమన్నారు. రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ఉండదని, తాను ప్రజా జీవితంలోనే ఉంటానని ఆయన చెప్పారు.
అనంతరం హన్మకొండలోని తన నివాసానికి వెళ్లిపోయారు. రాజయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో వారంతా జైలు నుంచి విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications