హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకా చిక్కు ముళ్లే: 'ఉప్పల్ నరబలి'లో రాజశేఖర్ ఇంకేదో దాస్తున్నాడా?, అది కట్టుకథేనా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉప్పల్ నరబలి కేసులో ముందు నుంచి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ వచ్చిన నిందితుడు రాజశేఖర్.. చిన్నారి అపహరణ విషయంలోనూ కట్టుకథే అల్లాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Recommended Video

చిన్నారిది నరబలే! అతనే నిందితుడు.. అదే పట్టించింది..!

రాజశేఖర్ చెప్పినట్టు చిన్నారిని బోయిగూడ నుంచే కిడ్నాప్ చేశాను అన్నదానికి ఎటువంటి ఆధారమూ లభించలేదు. పోలీసులు అతన్ని మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీ.. కొత్తగా ఏ విషయం రాబట్టలేదని తెలుస్తోంది.

 ఇంకా ఎటూ తేలలేదు:

ఇంకా ఎటూ తేలలేదు:

చిన్నారిదే నరబలే అని పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా నిర్దారించినప్పనటికీ.. ఆచూకీ కనుక్కోవడంలో మాత్రం విఫలమయ్యారు. చిన్నారి మొండెం ఎక్కడ పడేశాడు?, ఆమె తల్లిదండ్రులెవరు? అన్న విషయం ఇంత దాకా తేలలేదు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికే న్యాయస్థానం అనుమతితో రాజశేఖర్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారంతో గడువు ముగియడంతో కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే అతని నుంచి విలువైన సమాచారమేది రాబట్టలేకపోయారని తెలుస్తోంది.

ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..

అనుమానాలు అలాగే..:

అనుమానాలు అలాగే..:

బోయిగూడ నుంచే చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు రాజశేఖర్ చెబుతున్నప్పటికీ.. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు, టవర్‌ డంప్‌లను పరిశీలించగా.. అందులో ఏ ఆధారమూ లభించలేదు.

పైగా ఇంతవరకూ చిన్నారి తల్లిదండ్రులెవరూ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో రాజశేఖర్ ఇంకేదో దాస్తున్నాడన్న అనుమానాలు బలంగా ఉన్నాయి.

 తండా నుంచే కొనుక్కొచ్చాడా?..:

తండా నుంచే కొనుక్కొచ్చాడా?..:

కేసులో మొదటగా ప్రచారం జరిగినట్టు.. నిందితుడు రాజశేఖర్ చిన్నారిని ఏ మారుమూల గిరిజన తండా నుంచో కొనుక్కొచ్చి ఉండవచ్చునన్న వాదన మళ్లీ తెర పైకి వచ్చింది. కాబట్టే.. సదరు తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంలోనూ స్పష్టమైన సాక్ష్యాలేవి లేకపోవడంతో పోలీసుల ముందు ఇంకా చిక్కు ప్రశ్నలు అలాగే ఉన్నాయి.

ఆ సాక్ష్యాలు లభిస్తే..:

ఆ సాక్ష్యాలు లభిస్తే..:

రాజశేఖర్ చెప్పినట్టుగా మొండేన్ని నిజంగా మూసీలో పడేసి ఉంటే.. ఇప్పుడది దొరకడం కష్టం. ఒకవేళ రాజశేఖర్ అబద్దం చెప్పినట్టు తేలి.. ఇంకేదైనా కొత్త విషయం తెరపైకి వస్తే మాత్రం కేసు మరో మలుపు తిరిగే అవకాశముంది. ఏదేమైనా చిన్నారి ఆచూకీ తేలి.. మొండెం లభిస్తే మాత్రం రాజశేఖర్ దంపతుల చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకోవడం ఖాయం.

English summary
Police are still suspecting that accused Rajaseskhar still hiding key facts in Uppal human sacrifice case. On friday he presented infront of court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X