సస్పెన్షన్ ఎత్తెయ్యకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: రాజాసింగ్ సంచలనం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధిష్టానం తనపై సస్పెన్షన్ విధించడంతో, సస్పెన్షన్ తొలగించకపోతే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని రాజా సింగ్ తేల్చి చెప్పారు. అంతేకాదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన కూడా లేదని రాజాసింగ్ వెల్లడించారు.

సస్పెన్షన్ పై రాజా సింగ్ వ్యాఖ్యలు
తనపై విధించిన సస్పెన్షన్ ను తొలగించాలని ఆశిస్తున్నట్టు రాజాసింగ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయం వరకు అధిష్టానం సస్పెన్షన్ తొలగిస్తుంది అన్న నమ్మకం తనకు ఉందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనపై విధించిన సస్పెన్షన్ ను బిజెపి అధిష్టానం తొలగించకపోతే వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పిన రాజాసింగ్ స్వతంత్ర అభ్యర్థిగా కూడా తాను ఎన్నికల బరిలోకి దిగనని తేల్చి చెప్పారు.

మోడీ, అమిత్ షాపై కీలక వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్
తనకు బీజేపీ అధిష్టానం పై విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్న రాజాసింగ్ ఆయన వారికి పెద్ద అభిమానినిని అని వెల్లడించారు. బిజెపి పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్న ఆయన బిజెపిలోని అగ్ర నేతల ఆశీస్సులు తనపై ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ అగ్ర నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ తో పాటు ప్రతి ఒక్కరు తనని ఆదరిస్తారని రాజాసింగ్ స్పష్టం చేశారు.

రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ అధిష్టానం
మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పైన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బిజెపి అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా ఆయనను పార్టీ నాయకత్వం తొలగించింది. హైదరాబాద్లో మునావర్ ఫారుఖీ షో నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని రచ్చ చేసిన రాజాసింగ్ ఆపై మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలతో బిజెపి కేంద్రకం శిక్షణ సంఘం రాజాసింగ్ పై చర్యలు తీసుకుంది.

సస్పెన్షన్ తొలగింపుకు రాజా సింగ్ విజ్ఞప్తి
మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలతోనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని పేర్కొంది. బిజెపి నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా నాడు ప్రకటించింది. ఇక తాజాగా బిజెపి అగ్రనాయకత్వం నాడు విధించిన సస్పెన్షన్ తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ రాజాసింగ్, వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications