కొత్త పదవి: ఆఫీసులోకి రాజీవ్ శర్మ ప్రవేశం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తన నూతన కార్యాలయంలోకి మంగళవారం ప్రవేశించారు. సీఎస్గా పదవీవిరమణ చేసిన రోజునే ఆయన కొత్త బాధ్యలు స్వీకరించినప్పటికీ అప్పటికి కార్యాలయం సిద్ధంకాలేదు. ప్రస్తుతం కార్యాలయం సిద్ధమవడంతో ఆయన మంగళవారం కార్యాలయంలోకి ప్రవేశించారు. సచివాలయంలోని సీ బ్లాక్లోని సీఎం కార్యాలయం ఉన్న ఆరో అంతస్థులోనే రాజీవ్ శర్మకు కార్యాలయాన్ని కేటాయించారు. ఇకనుంచి ఆరో అంతస్థులో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కార్యాలయాలు మాత్రమే కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications