తెలంగాణలో ఆ పార్టీ గెలుపు పక్కా: లేటెస్ట్ సర్వే రిపోర్ట్: కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణలో ఈ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఇక్కడ త్రిముఖ పోరు నెలకొని ఉంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ రాష్ట్ర సమితి కసరత్తు పూర్తి చేసింది. జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలనే సంకల్పంతో ఉందా పార్టీ. బీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో పలు ఎన్నికల సర్వే సంస్థలు తమ ఒపీనియన్ పోల్స్ బయటపెడుతున్నాయి. తమ అంచనాలను వెల్లడిస్తూ వస్తోన్నాయి. ప్రజల నాడి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోన్నాయి. తెలంగాణ సహా ఎన్నికలను ఎదుర్కొంటోన్న మిగిలిన నాలుగు రాష్ట్రాల ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పటికే కొన్ని జాతీయ మీడియా సంస్థలు సైతం వ్యక్త పరిచాయి.
తాజాగా రాజ్‌నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో రూపొందించిన రిపోర్ట్ అది. మొత్తంగా 38,351 మంది అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదికను తయారు చేసింది.
మొత్తం తొమ్మిది వర్గాల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించింది రాజ్‌నీతి సంస్థ. రైతులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు/ఆటోడ్రైవర్లు, పక్కా ఇళ్ల యజమానులు, ఇతరులుగా వారిని విభజించింది. అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వారు ఇందులో ఉన్నారు.
భారత్ రాష్ట్ర సమితి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రాజ్‌నీతి ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది. బీఆర్ఎస్‌కు 75 స్థానాలు లభిస్తాయని తెలిపింది. 42.43 శాతం ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. సంపూర్ణ మెజారిటీతో బీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది.
Summarizing the latest opinion polls, it appears that BRS is poised to comfortably secure another government with a substantial mandate. Despite a commendable performance by Inc in recent months, it seems insufficient to sway votes away from BRS. BJP is relying on support from… pic.twitter.com/wu82YQeUHl
— Elections pe Charcha (@Rajneeti2023) November 23, 2023
కాంగ్రెస్‌కు 31 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. 32. 62 శాతం వరకు ఓట్లు పడొచ్చని రాజ్‌నీతి అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే- తెలంగాణలో మరోసారి హస్తం పార్టీకి పరాభవం తప్పకపోవచ్చు. మూడోసారి కూడా ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవుతుంది. గతంతో పోల్చుకుంటే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకోగలుగుతుంది.
భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులు అయిదు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుస్తారని రాజ్‌నీతి ఒపీనియన్ పొల్ తెలిపింది. 16.71 శాతం ఓట్లు పడతాయి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు ఏడు సీట్లు దక్కుతాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది.
ఈ ఒపీనియన్ పోల్‌పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. దీన్ని ఆయన స్వాగతించారు. జై తెలంగాణ అంటూ నినదించారు. #TelanganaWithKCR అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications