శోభన్ బాబు-జయలలిత గురించి ఆసక్తికరం! 'చంపేస్తానని.. శశికళ అంటేనే అసహ్యం'
దివంగత నటుడు శోభన్ బాబు చాలా మంచివ్యక్తి అని నాటి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె రామలక్ష్మి అన్నారు. కాలమిస్ట్, రైటర్, క్రిటిక్ రామలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Recommended Video

హైదరాబాద్: దివంగత నటుడు శోభన్ బాబు చాలా మంచివ్యక్తి అని నాటి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె రామలక్ష్మి అన్నారు. కాలమిస్ట్, రైటర్, క్రిటిక్ రామలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. శోభన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
చదవండి: అన్నాడీఎంకేను ఇరుకునపెట్టిన 'జయ కూతురు': ఎవరీ అమృత?

శోభన్ బాబు గురించి..
తనను ఓసారి శోభన్ బాబు తన ఇంటికి పిలిచారని, అక్కడ తన భార్యను చూపించాడని, తన గురువు గారు కూతురు పెళ్లి చేయలేడని తెలిసి, తానే ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడని రామలక్ష్మి తెలిపారు. శోభన్ బాబు వెరీ ఫైన్ మ్యాన్ అన్నారు.

జయలలిత నిజమైన ప్రేమ
జయలలిత వెరీ వెరీ ఫైన్ టాలెంటెడ్ గార్ల్ అని రామలక్ష్మి తెలిపారు. గోరింటాకు సినిమాను జయలలిత ఇంట్లో చిత్రీకరించారు. మీరందరూ ఇక్కడే భోజనం చేయాలని జయలలిత.. శోభన్ బాబుతో చెప్పిందని తెలిపారు. నేను వడ్డిస్తానని జయలలిత చెప్పారని తెలిపారు. జయలలిత నిజమైన ప్రేమ కనబరుస్తుందన్నారు.

భార్యను మోసం చేయలేక
జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకుందామనుకున్నాడని తెలిపారు. కానీ, సాధ్యపడలేదన్నారు. ఆయన తన భార్యను మోసం చేయలేకపోయాడన్నారు. శోభన్ బాబు చాలా సిన్సియర్ అన్నారు. శోభన్ బాబు కొడుకు కూడా బాగానే ఉంటాడని, కానీ ఎందుకో సినిమాల్లోకి రావద్దని చెప్పాడన్నారు.

శశికళపై తీవ్రంగా
జయలలిత నెచ్చెలి శశికళను మండోదరితో పోల్చారు రామలక్ష్మి. పోయెస్ గార్డెన్ గేట్లో నుంచి ఆమెను ఈడ్చేశారని, పబ్లిక్‌ను కంట్రోల్ చేయకుంటే చంపేసేవారన్నారు. ఒక మనిషిని డబ్బు చేసుకున్నాక కూడా ఆమెను (జయలలితను) చంపడం దారుణం అన్నారు.

శశికళ ముఖం చూసినా అసహ్యం
జయలలితకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయని, ఆమెను శశికళ మంచం మీద నుంచి కిందకు లాగి పడేసిందని తెలిసిందని, అప్పుడు ఆమె కిందపడిపోయిందని, పని మనిషి సాయానికి వెళ్తే... చంపేస్తానని శశికళ ఆమెను బెదిరించిందని తెలిసిందని రామలక్ష్మి చెప్పారు. ఆ తర్వాతే జయను ఆసుపత్రికి తరలించారన్నారు. జయలలితను దాదాపు చంపేశారని, ఆమె (శశికళ) ముఖం చూసినా అసహ్యం అన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications