ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ అద్భుతాన్ని జీవితంలో ఒక్కసారన్నా చూడండి
భారతీయ రైల్వే అంటేనే ఎన్నెన్నో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రసిద్ధి. కొంకణ్ రైల్వే, పంబన్ వంతెన... ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. తమిళనాడులోని రామేశ్వరం వద్ద భారతదేశ తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. రామేశ్వరం దగ్గర ఉన్న పంబన్ రైలు వంతెనను బ్రిటీష్ వారి హయాంలో 1914లో నిర్మించారు. ఇప్పటికి 105 సంవత్సరాలు పూర్తికావడంతో తుప్పు పట్టి సేవలు నిలిచిపోయాయి.
16 మంది పనిచేస్తేనే వంతెన పైకి లేస్తుంది
రామేశ్వరాన్ని భారతదేశ ప్రధాన భూభాగంతో అనుసంధానించిన ఈ వంతెన సేవలు నిలిచిపోవడంతో దానికి సమీపంలోనే కొత్త పంబన్ వంతెనను కేంద్ర రైల్వేశాఖ నిర్మించింది. అంతేకాకుండా పాత వంతెనకు, కొత్త వంతెనకు ఉన్న తేడాను వివరించారు. వేగంతోపాటు సరికొత్త సాంకేతికతను జోడించి కొత్త వంతెన నిర్మించామని, త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. 2019 మార్చిలో ఈ వంతెన నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశారు. 1914లో రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం (పంబన్ ద్వీపం) మధ్య వంతెనను సముద్రంలో నిర్మించారు. ఈ వంతెన మధ్య నుంచి పడవలు, ఓడలు వెళ్లాలంటే 16 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. వారు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది.

వంతెనను పైకి లిఫ్ట్ చేస్తారు
ప్రస్తుతం నిర్మించిన ట్రాక్ ఉన్న వంతెనను పైకి లిఫ్ట్ చేస్తారు. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దేశంలోనే తొలి రైల్వే వంతెన. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. కొత్త పంబన్ రైల్వే వంతెన భారతదేశంలోని ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. భారతదేశ ఇంజనీర్ల కృషికి నిదర్శనమే ఈ వంతెన నిర్మాణం. భారతదేశం మరోసారి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. 1.30 లక్షల కిటోమీటర్ల రైల్వే మార్గంతో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచిన భారతీయ రైల్వే త్వరలోనే ప్రథమస్థానానికి చేరుకునేందుకు కృషిచేస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే మార్గం అందుబాటలో లేని పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు శరవేగంగా అనుసంధాన ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. మున్ముందు రైల్వే మార్గం దేశవ్యాప్తంగా రెండు లక్షల కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications