Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు!

కాకతీయ యూనివర్సిటీ లోని విద్యార్ధులకు ఎలుకల భయం పట్టుకుంది. కాకతీయ యూనివర్సిటీలోని సమ్మక్క-సారలమ్మ హాస్టల్‌లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాత్రి సమయంలో హాస్టల్‌లో ఉన్న 11మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఇలాంటి సమస్యలు చిన్నవిగా కనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా ప్రమాదకర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉండటంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఎలుకలు కరిచి గాయపడిన విద్యార్థులు

ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు వెంటనే క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు వెళ్లగా, అక్కడ టిటి ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేకపోవడం మరింత నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. దీంతో వారు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. విశ్వవిద్యాలయం వంటి పెద్ద విద్యాసంస్థలో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడం పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Rats in Kakatiya University 11 students suffer with rats bites students Concerns about hostels

హాస్టల్ లో ఎలుకల బెడద

హాస్టల్‌లో ఎలుకల సమస్య కొత్తది కాదని, చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఎలుకలు గదుల్లోకి వచ్చి వస్తువులను కొరుకుతూ, విద్యార్థుల నిద్రకు భంగం కలిగిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.

నిర్లక్ష్యం, పరిశుభ్రత లేకపోవటంతో విద్యార్థులకు ఇబ్బంది

ఈ ఘటనపై హాస్టల్ డైరెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థులు మండిపడుతున్నారు. హాస్టల్ పరిశుభ్రత, పరిసరాలలో ఎలుకల నియంత్రణ వంటి అంశాల్లో నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఎలుకల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన తర్వాతైనా విశ్వవిద్యాలయ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని హాస్టల్ పరిస్థితులను మెరుగుపరచాలని విద్యార్థులు కోరుతున్నారు.

హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్

విద్యార్థుల ఎలుకల బెదడపై అధికారులు స్పందిస్తారా?

హాస్టల్‌లో శుభ్రతను పెంపొందించడం, ఎలుకల నివారణ చర్యలు చేపట్టడం, అలాగే హెల్త్ సెంటర్‌లో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచడం అత్యవసరమని అంటున్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+